భారత్ లో 5జీ నెట్వర్క్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 5జీ ఉన్న మొబైల్ ఫోన్స్ ను కూడా ఎక్కువగా కొనుక్కుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎప్పుడు తీసుకుని వస్తారు అనే ప్రశ్న ఎదురవుతూ ఉంది.
5జీ నెట్‌వర్క్‌ను మూడు నెలల్లోనే అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలపరమైన సమస్యలు.. అడ్డంకులుగా ఉంటున్నాయని టెలికాం కంపెనీలు చెబుతూ ఉన్నాయి. టెక్నాలజీకి కీలకమైన ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఇన్‌ఫ్రా ఇంకా సిద్ధంగా లేదని.. కేవలం కొన్ని ప్రాంతాలలోనే 5జీ నెట్‌వర్క్ రాబోతోంది.
భారతదేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ సత్వరం నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోలేకపోవచ్చని నోకియా ఇండియా హెడ్ (మార్కెటింగ్) అమిత్ మార్వా తెలిపారు. దేశానికి, ప్రపంచానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రస్తుతం 5జీ సేవలు ఎంతో అవసరమని అన్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మూడు నెలల్లోనే భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లను వినియోగంలోకి తేవడం మొదలుపెట్టొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.