అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో భూకంపం

5.2 Magnitude Earthquake hits Andaman and Nicobar islands.అండ‌మాన్ నికోబార్ దీవుల్లో శుక్ర‌వారం రాత్రి భూకంపం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 25 Sept 2021 9:43 AM IST

అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో భూకంపం

అండ‌మాన్ నికోబార్ దీవుల్లో శుక్ర‌వారం రాత్రి భూకంపం సంభ‌వించింది. రాత్రి 8.35 గంట‌ల‌కు క్యాంప్‌బెల్ బేలో భూమి కంపించింద‌ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 5.2గా న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది. భూమి నుంచి 63కిలోమీట‌ర్ల లోతున భూమికంపించింద‌ని చెప్పింది. భూప్ర‌కంప‌న‌ల‌తో ఆందోళ‌న చెందిన ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

కాగా.. అండ‌మాన్ నికోబార్ దీవుల్లో త‌ర‌చుగా భూకంపాలు సంభ‌విస్తున్నాయి. ఈ నెల 22న‌(బుధ‌వారం) రాత్రి 11.45 గంట‌ల‌కు కూడా 3.9తీవ్ర‌తో భూప్ర‌కంప‌న‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Next Story