అరుణాచల్ ప్రదేశ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

5.1 Magnitude earthquake strikes Arunachal Pradesh.అరుణాచల్ ప్ర‌దేశ్‌లో భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. పాంగిన్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2022 7:23 AM GMT
అరుణాచల్ ప్రదేశ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

అరుణాచల్ ప్ర‌దేశ్‌లో భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. పాంగిన్‌కు ఉత్తర ప్రాంతంలో 1174 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌గా 5.1గా న‌మోదు అయిన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. శుక్ర‌వారం రాత్రి 9.51 ప్రాంతంలో భూ ప్రకంప‌న‌లు చోటుచేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేని చెప్పారు.

తమిళనాడు రాష్ట్రంలో రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో మూడు సార్లు భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. దిండిగల్ ప్రాంతంలో సంభ‌వించిన ఈ భూ ప్ర‌కంప‌న‌ల తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 1.2 నుంచి 1.5 మ‌ధ్య న‌మోదైంది. భూకంప కేంద్రాన్ని భూమికి 10కిలోమీట‌ర్ల లోతులో గుర్తించారు. భూకంపం కార‌ణంగా గ్రామంలోని కొన్ని ఇళ్ల‌లో ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి.

గుజ‌రాత్‌లోని ద్వార‌కలో కూడా శుక్ర‌వారం భూకంపం సంభ‌వించింది. ద్వార‌క స‌మీపంలో 5.3 తీవ్ర‌త‌తో భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నారు. ద్వారకకు పశ్చిమాన 556 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Next Story