పాత ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 50కిపైగా దుకాణాలు ద‌గ్ధం

50 Shops Burnt In Delhi Market Fire.పాత ఢిల్లీలోని చాందిని చౌక్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2022 10:42 AM IST
పాత ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 50కిపైగా దుకాణాలు ద‌గ్ధం

పాత ఢిల్లీలోని చాందిని చౌక్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. గురువారం రాత్రి భ‌గీర‌థి ప్యాలెస్ ఎల‌క్రానిక్ మార్కెట్‌లోని ఓ షాపులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి ప‌క్క‌నున్న దుకాణాల‌కు అంటున్నాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. 18 ఫైరింజ‌న్ల‌తో మంట‌లను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ సాధ్య‌ప‌డ‌లేదు. దీంతో మ‌రిన్ని ఫైరింజ‌న్ల‌ను ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాయి. దాదాపు 40 ఫైరింజన్లల‌తో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. రిమోట్ కంట్రోలుతో పనిచేసే అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు.

స్థానికులు రాత్రి 9.20 గంటలకు ఘటనపై తమకు సమాచారం అందించారని, అనంతరం అగ్నిమాపక యంత్రాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారని అగ్నిమాపక శాఖ తెలిపింది. భవనంలో చాలా భాగం దెబ్బతింది. మంటలను ఆర్పడానికి అధికారులు రిమోట్ కంట్రోల్ ఫైర్ ఫైటింగ్ మెషీన్‌ను ఉపయోగిస్తున్నారు అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.

ఘ‌ట‌నాస్థ‌లాన్నికేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సందర్శించారు. భ‌వ‌నంలోని షాపులు దెబ్బ‌తిన్నాయ‌న్నారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం వాటిల్ల‌లేద‌ని, అయితే.. పెద్ద ఎత్తున ఆస్తిన‌ష్టం వాటిల్లిన‌ట్లు తెలుస్తోందన్నారు.

Next Story