మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు 5 లీటర్ల పెట్రోల్.. ఇదో వెరైటీ..!

5 litres of petrol for Man of the Match goes viral.క్రికెట్ టోర్నమెంట్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఏకంగా 5 లీటర్ల పెట్రోల్ ను అందించడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 6:52 AM GMT
5 litres of petrol for Man of the Match goes viral

క్రికెట్ టోర్నమెంట్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లకు అద్భుతమైన ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు. భారత్‌లో జరిగే టోర్న‌మెంట్‌ల‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిస్తే న‌గ‌దు కానీ ప్రైజ్‌లు ఇస్తూ ఉంటారు. అయితే.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఏకంగా 5 లీటర్ల పెట్రోల్ ను అందించడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. నమ్మశక్యంగా లేదు కదూ.. మీరు వింటోంది నిజమే..! ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు ఎంతగా పెరిగిపోతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. అందుకే కాస్త కాస్ట్ లీ ప్రైజ్ కిందనే పెట్రోల్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఇస్తూ ఉన్నారు.


ఇటీవల భోపాల్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పెట్రోల్ ధరల పెరుగుదలపై ఇలా సెటైరికల్ గా చూపించారు. ఫైనల్స్‌ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు విన్నర్‌కు 5 లీటర్ల పెట్రోబాటిల్‌ను బహుమతిగా అందించారు. సలావుద్దీన్‌ అబ్బసీ ఈ పెట్రో అవార్డును గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్‌‌ భోపాల్‌ కాంగ్రెస్‌ నాయకుడు మనోజ్‌శుక్లా ఆధ్వర్యంలో జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటడంతో ఒక వ్యక్తి పెట్రోల్‌ బంక్‌ ముందు నిలబడి పెట్రోల్‌ రేటు సెంచరి కొట్టేసిందోచ్‌‌ అంటూ తన నిరసనను బ్యాట్‌ పైకెత్తి మరీ చూపించడం కూడా దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఇంకా పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయోనని సామాన్యులు తెగ టెన్షన్ పడుతూ ఉన్నారు.


Next Story
Share it