ఘోర ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డిన మినీ బ‌స్సు.. 5 గురు దుర్మ‌ర‌ణం

5 Dead after Minibus skids into Gorge.జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఘోర ప్ర‌మాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2023 1:06 PM IST
ఘోర ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డిన మినీ బ‌స్సు.. 5 గురు దుర్మ‌ర‌ణం

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. మినీ బ‌స్సు అదుపు త‌ప్పి లోయ‌లో ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 5 గురు మ‌ర‌ణించారు. మ‌రో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

పోలీసులు తెలిపిన వివ‌రాల ఇలా ఉన్నాయి. కొంద‌రు మినీ బ‌స్సులో కౌగ్ నుండి డానీ పెరోల్‌కు బ‌య‌లుదేరారు. బిల్లావర్‌లోని ధను పరోల్ గ్రామ స‌మీపంలోకి రాగానే బ‌స్సు అదుపు త‌ప్పి లోయ‌లో ప‌డింది. శుక్ర‌వారం అర్థ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. గాయ‌ప‌డిన వారి బిలావ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రో వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ ఘ‌ట‌న‌పై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశాడు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలియ‌జేశారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Next Story