కృష్ణసాగర్‌ సరస్సులో ఐదుగురు చిన్నారుల గల్లంతు

గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలోని కృష్ణ సాగర్ సరస్సులో శనివారం ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఇద్దరు పిల్లలు

By అంజి  Published on  14 May 2023 9:15 AM IST
Krishna Sagar Lake , Gujarat, Botad

కృష్ణసాగర్‌ సరస్సులో ఐదుగురు చిన్నారులు గల్లంతు

గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలోని కృష్ణ సాగర్ సరస్సులో శనివారం ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఇద్దరు పిల్లలు సరస్సులో ఈత కొడుతుండగా వారు మునిగిపోవడం ప్రారంభించారు. అక్కడికక్కడే ఉన్న మరో ముగ్గురు చిన్నారులను కాపాడేందుకు సరస్సులోకి దూకారు. అయితే, వారు కూడా మునిగిపోయారు. మృతులంతా మైనర్లే. సాయంత్రం 4:30 గంటల సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టినా చిన్నారులను రక్షించలేకపోయారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

''బోటాడ్ పట్టణం వెలుపల ఉన్న కృష్ణ సాగర్ సరస్సులో మునిగి ఐదుగురు పిల్లలు మరణించారు. ఇద్దరు పిల్లలు మధ్యాహ్నం ఈత కొడుతుండగా నీటిలో మునిగిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న మరో ముగ్గురు వారిని కాపాడేందుకు నీటిలోకి దూకినప్పటికీ వారు కూడా మునిగిపోయారు. అందరి వయస్సు 16-17 సంవత్సరాల మధ్య ఉంటుంది. తదుపరి విచారణ కొనసాగుతోంది'' అని బోటాడ్ ఎస్పీ కిషోర్ బలోలియా తెలిపారు.

Next Story