పుణెలో లారీ బీభత్సం.. 47 వాహనాలు ధ్వంసం.. 38 మందికి తీవ్రగాయాలు
48-Vehicle Pile-Up On Pune-Bengaluru Highway, 38 Injured. మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్
By అంజి Published on 21 Nov 2022 10:54 AM ISTమహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఓవర్ స్పీడ్‌తో మిగతా వెహికల్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసం అయ్యాయి. లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని, దీని కారణంగానే లారీ అదుపు తప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. లారీలోని ఆయిల్ రహదారిపై పడటంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న ఫుణె ఫైర్ సిబ్బంది, పుణె మెట్రోపాలిటన్ రీజియర్ డెవలప్‌మెంట్ అథారిటీ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడినవారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆదివారం పూణెలోని నవాలే వంతెన వద్ద పలు వాహనాలను ట్యాంకర్ ఢీకొనడంతో కనీసం 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసమయ్యాయని పూణే అగ్నిమాపక దళ అధికారి తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ముంబైకి వెళ్లే రహదారిపై 2 కిలోమీటర్ల మేర జామ్‌లు ఏర్పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. గత కొన్ని రోజులుగా నావెల్ బ్రిడ్జ్ ప్రమాదాల హాట్ స్పాట్‌గా మారుతోంది. శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్డుపై వంతెన సమీపంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని మహిళ మృతి చెందింది.
A major accident occurred at Navale bridge on the Pune-Bengaluru highway in Pune in which about 48 vehicles got damaged. Rescue teams from the Pune Fire Brigade and Pune Metropolitan Region Development Authority (PMRDA) have reached the spot: Pune Fire Brigade pic.twitter.com/h5Y5XtxVhW
— ANI (@ANI) November 20, 2022
Major accident near Navle bridge, about 48 vehicles damaged, several injured..!!#Pune #Maharashtra #accidente@nitin_gadkari @Dev_Fadnavis @narendramodi @AmitShah pic.twitter.com/dZLFMFJbek
— 𝕾𝖆𝖓𝖌𝖗𝖆𝖒⚜️ (@sangram_0277) November 20, 2022
Horrible Accident at Navale Bridge Pune .... minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ
— Nikhil Ingulkar (@NikhilIngulkar) November 20, 2022