భూ ప్ర‌కంప‌న‌లు.. నిన్న అస్సాంలో.. నేడు సిక్కింలో

4.3 Magnitude Earthquake Strikes Sikkim.వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2023 2:09 AM GMT
భూ ప్ర‌కంప‌న‌లు.. నిన్న అస్సాంలో.. నేడు సిక్కింలో

వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. సిక్కింలో భూమి కంపించింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున 4.15 గంట‌ల స‌మ‌యంలో యుక్సోమ్ పట్టణంలో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.3గా న‌మోదైంది. యుక్సోమ్‌కు వాయువ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రాన్ని గుర్తించిన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్‌) తెలిపింది. కాగా..ఈ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం వాటిల్లిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఆదివారం అస్సాంలో భూమి కంపించింది. సాయంత్రం 4.18 గంటలకు రాష్ట్రంలోని నాగోన్‌లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప‌ తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0 న‌మోదైంది. అంత‌కు ఒక రోజు ముందు గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి

Next Story