ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
4 Women die in accident in Rajasthan.రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును కారు ఢీ కొట్టింది.
By తోట వంశీ కుమార్ Published on
11 Sep 2021 6:58 AM GMT

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతిచెందగా.. మరో 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం బార్మేర్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. 18 మంది ప్రయాణీకులతో వెలుతున్న కారు.. బార్మేర్ గ్రామం వద్ద అదుపు తప్పి బస్సును చాలా వేగంగా ఢీ కొట్టింది.
దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్తలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story