ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్-ట్రాలీ పికప్ ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఖతిమా-నంకనా సాహిబ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగిందని, నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారని వారు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఖతిమాలోని సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడి నుండి వారిని మరొక ఆసుపత్రికి తరలించారు. ఆ కార్మికులు ఖతిమా ప్రాంతంలో ఒక కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. దీపావళి కోసం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌కు ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.