చీనాబ్ న‌దిలో ప‌డిపోయిన కారు.. న‌లుగురు మృతి..!

4 Feared dead after car plunges into Chenab river in Doda.కారు అదుపు త‌ప్పి చీనాబ్ న‌దిలో ప‌డిపోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 10:10 AM IST
చీనాబ్ న‌దిలో ప‌డిపోయిన కారు.. న‌లుగురు మృతి..!

కారు అదుపు త‌ప్పి చీనాబ్ న‌దిలో ప‌డిపోయింది ఈ ప్ర‌మాదంలో న‌లుగురు వ్య‌క్తులు గ‌ల్లంతు అయ్యారు మంగ‌ళ‌వారం రాత్రి 7.30 గంట‌ల ప్రాంతంలో జ‌మ్ము కశ్మీర్‌లోని దోడాలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కారు దోడా నుంచి కిష్త్వార్‌కు వెలుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గ‌ల్లంతైన న‌లుగురి కోసం గాలింపు చేప‌ట్టారు. వారు మ‌ర‌ణించి ఉంటార‌ని అధికారులు బావిస్తున్నారు. రాత్రి స‌మ‌యంలో కావ‌డంతో రెస్క్యూ ఆప‌రేష‌న్‌ను నిలిపివేశారు. బుధ‌వారం వేకువ జామున‌నే తిరిగి ప్రారంభించారు.

ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ప్రమాద బాధితుల జాడ కోసం అన్ని విధాలా కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

దొడ డీసీ విశేష్ పాల్ మహాజన్‌తో మాట్లాడుతూ.. "నలుగురు వ్యక్తులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ కారు ప్రమాదవశాత్తూ థాత్రి, ప్రేమ్ నగర్ మధ్య షిబ్నోట్ వద్ద చీనాబ్ నదిలో పడిపోయింది. బాధితులను కనుగొనడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను నిరంతరం టచ్ లో ఉన్నాను. '' అని జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.

Next Story