ఢిల్లీలో క‌రోనా క‌ల‌క‌లం.. ఒకే ఆస్ప‌త్రికి చెందిన‌ 37 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా

37 Doctors tested positive in delhi.ఢిల్లీలోని స‌ర్ గంగారామ్ ఆస్ప‌త్రికి చెందిన 37 మంది వైద్యులు ఒకే సారి క‌రోనా బారిన ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2021 8:01 AM GMT
doctors tested corona positive

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక ఢిల్లీలోనూ ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. కొద్ది రోజులుగా రోజు వారి కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. ఆస్ప‌త్రుల‌కు వ‌స్తున్న రోగుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. వీరిలో పలువురు హెల్త్ కేర్ వర్కర్లు కూడా ఉన్నారని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని స‌ర్ గంగారామ్ ఆస్ప‌త్రికి చెందిన 37 మంది వైద్యులు ఒకే సారి క‌రోనా బారిన ప‌డ్డారు. వీరిలో 32 మంది ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వీరంతా వ్యాక్సినేషన్‌ తొలిదశలో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారే కావడంతో మరింత ఆందోళన క‌లుగుతోంది. ఈ వైద్యుల్లోని చాలా మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దాదాపు ఏడాదిగా వీరంతా కరోనా సోకిన వారితోనే గడుపుతూ వచ్చారని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా వారు ఎవరెవరిని కలిశారన్న విషయమై విచారణ ప్రారంభించామని.. కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక గురువారం నాడు ఢిల్లీలో 7,437 కొత్త కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ ఢిల్లీ పరిధిలో కరోనా కారణంగా 11,157 మంది ప్రాణాలు కోల్పోయారు.




Next Story