జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచల్ సెక్టార్‌లో విషాద ఘటన జరిగింది. ఎల్‌ఓసి సమీపంలోని ఫార్వర్డ్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్న భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్‌కు చెందిన ముగ్గురు జవాన్లు బుధవారం లోతైన లోయలో జారిపడి మరణించారు. వారికోసం గాలింపు చేపట్టి.. ముగ్గురు సైనిక సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు బుధవారం ఉదయం తెలిపారు. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ప్రకటన ప్రకారం.. ''ఈ సంఘటన మచల్ సెక్టార్‌లో జరిగింది.
ఫార్వార్డ్ ఏరియాలో రెగ్యులర్ ఆప్ టాస్క్ జరుగుతున్నప్పుడు, ట్రాక్‌పై మంచు కురుస్తున్నప్పుడు ఒక జేసీవో, ఇద్దరు ఓఆర్‌ల బృందం లోతైన లోయలోకి జారిపోయింది. ముగ్గురు ధైర్యవంతుల మృత దేహాలను తిరిగి పొందాం'' అని పేర్కొంది. ట్రాక్‌పై దట్టమైన మంచు కురవడం వల్లే ఈ ఘటన జరిగిందని శ్రీనగర్ పోలీసులు ట్వీట్ చేశారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.