పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో పోలీసు పోస్ట్‌పై దాడి చేసిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు డిసెంబర్ 23, సోమవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అనే నిషేధిత సంస్థకు చెందిన నిందితులు గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్‌ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)లు.. పంజాబ్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసుల సంయుక్తంగా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
వారి నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టల్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పురాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ముగ్గురు నిందితులు ఉన్నట్లు పంజాబ్ పోలీసుల బృందం పిలిభిత్ పోలీసులకు సమాచారం అందించింది. ఆ తర్వాత ఆపరేషన్ ప్రారంభించబడింది. అలాగే పురాన్‌పూర్‌లో అనుమానాస్పద వస్తువులతో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
సమాచారం ఆధారంగా, పోలీసులు నిందితులను కార్నర్ చేశారు. సోమవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది, ఇందులో ముగ్గురు నిందితులు మరణించారు. "నిందితులు సవాలు చేస్తూ పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. ప్రతీకార కాల్పుల్లో వారు మరణించారు. పంజాబ్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసుల బృందాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. పంజాబ్ పోలీసు బృందం వారి విదేశీ సంబంధాల గురించి కూడా మాకు చెప్పింది. విచారణ మొత్తం ఘటనపై విచారణ చేపట్టాం’’ అని పిలిబిహిత్ పోలీసు సీనియర్ అధికారి మీడియా ప్రకటనలో తెలిపారు.
అంతకుముందు డిసెంబర్ 21, శనివారం, గురుదాస్‌పూర్ జిల్లాలోని కలనౌర్ సబ్ డివిజన్‌లోని పాడుబడిన పోలీసు పోస్ట్‌లో పేలుడు సంభవించింది. అయితే పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.