కేజ్రీవాల్ కుమార్తెను మోసం చేసిన వారిలో ముగ్గురు అరెస్ట్

3 held for duping Kejriwal's daughter. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను మోసం చేసిన వారిలో ముగ్గురు అరెస్ట్

By Medi Samrat  Published on  15 Feb 2021 12:07 PM GMT
3 held for duping Kejriwals daughter

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ఇటీవల ఆన్ లైన్ లో మోసపోయారంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే..! ప్రముఖ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మాలనుకుంది హర్షిత. కొద్ది మొత్తంలో ఆమె అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత ఆమె పంపించిన క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఆమె అకౌంటులో ఉన్న రూ. 34 వేలను దోచేశాడు. డీల్ ఫైనల్ అయిన తర్వాత సదరు వ్యక్తి హర్షిత కేజ్రీవాల్​ మొబైల్​కి ఒక క్యూఆర్ కోడ్ పంపి.. ఆ కోడ్‌ను స్కాన్ చేయగానే మీ అకౌంట్​లో డబ్బు జమ అవుతుందని నమ్మించాడు. ఆ వ్యక్తి చెప్పినట్టే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. హర్షిత ఖాతా నుంచి నిందితుని అకౌంట్​కి 34,000రూపాయలు బదిలీ అయిందని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులకు హర్షిత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

ఈ కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. సోఫాను అమ్ముతున్నట్టు ఆన్ లైన్లో హర్షిత పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో, తనను తాను కస్టమర్ గా పేర్కొన్న ఓ వ్యక్తి... చిన్న మొత్తాన్ని ఆమె అకౌంట్ కు బదిలీ చేస్తూ, బార్ కోడ్ ను స్కాన్ చేయాలని కోరాడు. అతని మాటలను నమ్మిన హర్షిత బార్ కోడ్ ను స్కాన్ చేశారు. ఆ తర్వాత ఆమె అకౌంట్ నుంచి రెండు విడతలుగా రూ. 20 వేలు, రూ. 14 వేలను కొట్టేశారు


Next Story