కరోనా కలకలం.. 29 మంది పాఠశాల విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

29 school students test Covid positive in West Bengal. రెసిడెన్షియల్ పాఠశాలలో కనీసం 29 మంది విద్యార్థులు కోవిడ్-19కి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని ఒక అధికారి తెలిపారు.

By అంజి  Published on  23 Dec 2021 5:05 AM GMT
కరోనా కలకలం.. 29 మంది పాఠశాల విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో కనీసం 29 మంది విద్యార్థులు కోవిడ్-19కి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని ఒక అధికారి తెలిపారు. "కళ్యాణిలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని 9, 10 తరగతులకు చెందిన 29 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వారిని తిరిగి వారి ఇళ్లకు తీసుకెళ్లమని వారి సంరక్షకులకు సమాచారం అందించబడింది" అని అధికారి వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో అన్నారు. కోవిడ్-19 పాజిటివ్‌గా గుర్తించిన విద్యార్థులకు దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నందున వారిని హోమ్ క్వారంటైన్ చేయాలని సూచించారు.

సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO) కళ్యాణి, హిరాక్ మండల్ మాట్లాడుతూ.. పాఠశాలలోని ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులను కూడా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.కాగా పశ్చిమబెంగాల్‌లో మరో 534 మంది ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్ పరీక్షించడంతో కోవిడ్ సంఖ్య బుధవారం 6,28,464 కు పెరిగింది. కోవిడ్‌ పాజిటివ్ వచ్చిన ఇద్దరు విదేశీయులకు బుధవారం ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది.

మరోవైపు దేశ వ్యాప్తంగా కొత్తగా 7,495 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారి నుండి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. 2020 మార్చి తర్వాత కనిష్టానికి కరోనా పాజిటివ్‌ కేసులు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 78,291 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా.. రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 139.70 కోట్లకు పైగా కరోనా వ్యాక్సినేషన్‌ పంపిణీ జరిగింది. ఇక దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 236కు చేరగా.. 104 మంది కోలుకున్నారు.

Next Story