జాతీయ రహదారికి సమీపంలో ఓ కంటైనర్ చాలా సేపుగా నిలిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ కంటైనర్‌ను తెరిచి చూసి షాకైయ్యారు. ఆ కంటైనర్‌లో 29 ఆవులు మరణించి ఉన్నాయి. ఓ ఆవు సజీవంగా ఉంది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లాలో చోటు చేసుకుంది.
మధుర సర్కిల్ ఆఫీసర్ (సిఓ) హర్షిత సింగ్ ఈ ఘటనపై స్పందించారు. మథుర జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలో మూసి ఉన్న కంటైనర్ చాలా సేపుగా అక్కడే ఉన్నట్లు మాకు సమాచారం అందింది. మేము అక్కడి వెళ్లి చూడగా.. కంటైనర్‌లో 29 ఆవులు చనిపోగా, ఒక ఆవు సజీవంగా కనిపించింది. ఈ విషయం తెలిసే డ్రైవర్ కంటైనర్‌ను అక్కడే వదిలేసి పారిపోయినట్లుగా ఉన్నాడు. " దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హర్షిత సింగ్ తెలిపారు.