270 మంది వైద్యులను బలితీసుకున్న సెకండ్ వేవ్

270 doctors died of Covid in second wave of pandemic. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 269 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధికారికంగా ప్రకటించింది.

By Medi Samrat  Published on  18 May 2021 11:21 AM GMT
doctors

ప్రాణాలు పణంగా పెట్టి మరీ కరోనా కాలంలో వైద్య సేవలందిస్తున్న వైద్యులు ఎంతోమంది. కానీ ఈ మహమ్మారికి అలాంటి విషయాలు ఏమి అవసరం లేదు.. పేద, ధనిక, ఉద్యోగ, నిరుద్యోగ అన్న బేధం లేకుండా ఒక్కొక్కరు కరోనా కాటుకు బలైపోతున్నారు.

ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 269 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు బిహార్‌లో అత్యధికంగా 78 మంది, ఉత్తరప్రదేశ్‌లో 37, ఢిల్లీలో 29 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 22 మంది,తెలంగాణలో 19 మంది మరణించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా డాక్టర్ల మరణాలు నమోదైనట్లు ఐఎంఏ తెలిపింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రిజిస్ట్రీ ప్రకారం మొదటి వేవ్‌లో 748 మంది వైద్యులు ప్రాణాలు విడిచారు. ఇక సెకండ్ వేవ్ లో 270 మంది మృతిచెందారు. వైద్యుల మృతిపై ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ జేఏ జయలాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ కోవిడ్ 19 తో మరణించారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన అగర్వాల్.. కరోనా వైరస్ పరిస్థితిపై ప్రజల్లో ఎంతో అవగాహనను కల్పించడానికి కృషి చేశారు. అటువంటి వ్యక్తి కరోనా కారణంగా వారం రోజుల పాటూ ఏయిమ్స్ లో చికిత్స పొంది సోమవారం రాత్రి మరణించారు.


Next Story
Share it