మెరుపులు,పిడుగుల బీభత్సం.. పిడుగుపాటుకు 26 మంది మృతి

26 killed in lightning strikes in West Bengal.ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఉరుములు, మెరుపులు భీభ‌త్సం సృష్టించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2021 10:47 AM IST
మెరుపులు,పిడుగుల బీభత్సం.. పిడుగుపాటుకు 26 మంది మృతి

ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఉరుములు, మెరుపులు భీభ‌త్సం సృష్టించాయి. పిడుగులు ప‌డి 26 మంది మృత్యువాత ప‌డ్డారు. సోమ‌వారం తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. పిడుగులతో హుగ్లీ జిల్లాలో 11 మంది, ముర్షిదాబాద్‌లో తొమ్మిది మంది, బంకురా, ఈస్ట్‌ మిడ్నాపూర్‌, వెస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.

ఈ ప్ర‌కృతి విప‌త్తుకు 26 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. మృతులకు ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.2ల‌క్ష‌లు, గాయపడ్డ వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం మెరుపు, ఉరుములతో కూడిన వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్బా మెదినీపూర్, దక్షిణ 24 పరగణాలు, కోల్‌కతా, హూగ్లీ, హౌరా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, నదియా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 37.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన కోల్‌కతాలో సాయంత్రం 12 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కార్యాలయం తెలిపింది.

Next Story