24గంట‌ల్లో 24,882 క‌రోనా కేసులు

24882 New Corona cases in india.దేశంలో క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తి మ‌ళ్లీ మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2021 6:13 AM GMT
24గంట‌ల్లో 24,882 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తి మ‌ళ్లీ మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 8.40ల‌క్ష‌ల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 24,882 మందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. తాజా కేసుల‌తో క‌లిసి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది. నిన్న 19,957 మంది వైర‌స్ నుంచి కోలుకోగా.. మొత్తంగా 1,09,73,260 మంది క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించారు. రిక‌వ‌రీ రేటు 96.82 శాతంగా ఉంది. గ‌డచిన 24 గంట‌ల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 2,02,022 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2,82,18,457 మందికి వ్యాక్సిన్లు వేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.


Next Story
Share it