సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది సెలబ్రెటీలుగా మారుతున్నారు. అలాగే లీనా నాగవంశీ అనే యువతి కూడా సెలబ్రెటీగా మారింది. అయితే.. ఏమైందో తెలీదు గానీ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
చక్రధర్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంగేశ్వర్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల లీనా నాగవంశీ బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె చదువుకునేందుకు ఇంటి టెర్రస్‌పైకి వెళ్లింది. అరగంట తరువాత ఆమె తల్లి పైకి వెళ్లి చూడగా చున్నీతో ఉరివేసుకుని వేలాతుతూ ఉండటాన్ని గుర్తించింది. వెంటనే ఆమె కేకలు వేసింది. స్థానికులు అక్కడకు చేరుకుని లీనాను కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ఖలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కుటుంబంలో లీనా నాగవంశీ చిన్న కుమార్తె. ఆమె సోషల్ మీడియాలలో యాక్టివ్‌గా ఉండేది. టిక్‌టాక్‌లో వీడియోలు చేసేది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 10,000 మందికి పైగా ఫాలోవర్లను ఉన్నారు.