బిగ్‌బ్రేకింగ్ : మహారాష్ట్రలో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్.. 22 మంది మృతి
Oxygen Tanker Leak In Maharashtra. మహారాష్ట్రలోని నాసిక్ లో జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో దురదృష్టవశాత్తూ ఆక్సిజన్ ట్యాంక్ లీక్ అయింది.
By Medi Samrat Published on 21 April 2021 3:10 PM ISTమహారాష్ట్రలోని నాసిక్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో దురదృష్టవశాత్తూ ఆక్సిజన్ ట్యాంక్ లీక్ అయింది. ఆసుపత్రి బయట ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒక ట్యాంక్ నుంచి భారీగా ఆక్సిజన్ లీక్ కావడంతో ఆ ప్రాంతమంతా తెల్లని గ్యాస్ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు.
#WATCH | An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp
— ANI (@ANI) April 21, 2021
ఈ ఘటన కారణంగా అర గంట పాటూ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో దాదాపు 150 మంది పేషెంట్స్ వెంటిలేటర్ల మీద, ఆక్సిజన్ సపోర్టుతో ఉన్నారు. అరగంట పాటూ ఆక్సిజన్ అందకపోవడంతో 22 మంది దాకా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆక్సిజన్ ఒక్కసారిగా ఆగిపోవడంతో రోగులు బంధువులు ఆందోళనకు గురయ్యారు.
భారత్ లో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే..! ఎప్పటికప్పుడు అధికారులు ఆయా ఆసుపత్రుల కోసం ఆక్సిజన్ ను సరఫరా చేసే చర్యలను చేపట్టారు. నాసిక్‌లోని ఈ ఆసుపత్రిలో కూడా అదే విధంగా ఆక్సిజన్ నింపుతుండగా ఆక్సిజన్ ట్యాంక్ అకస్మాత్తుగా లీక్ కావడం ప్రారంభమైంది. దీంతో ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక దళ సిబ్బందిని తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ పరిణామంతో ఆక్సిజన్ సరఫరా 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ అవసరమయ్యే రోగులకు ఊపిరి ఆడలేదు. కొందరిని ఇతర ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడాలని ఆసుపత్రి సిబ్బంది భావించి ఆ ప్రయత్నం చేసింది. మరికొందరికి ఆక్సిజన్ అండగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 22 మంది మరణించారు. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటూ ఉన్నారు. ఊహించని ఈ ఘటనతో ఆక్సిజన్ అవసరమయ్యే రోగుల ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయి.