పాక్ వెళ్లి వచ్చిన 200 మంది సిక్కులకు కరోనా

200 Sikh Pilgrims Test Positive.బైసాకి పర్వ దినం జరుపుకోవడం కోసం పాకిస్తాన్‌ వెళ్లొచ్చిన 200 మందికి పైగా పంజాబీలు కరోనా బారిన పడ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 23 April 2021 8:59 AM IST

Sikki piligrims tests corona positive

బైసాకి పర్వ దినం జరుపుకోవడం కోసం పాకిస్తాన్‌ వెళ్లొచ్చిన 200 మందికి పైగా పంజాబీలు కరోనా బారిన పడ్డారు. బైసాకి పండుగ చివరి రోజున లాహోర్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌ను సుమారు 800 మంది సిక్కులు దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా భారత్‌-పాక్‌ చెక్‌ పోస్టు అటారీ వాఘా వ‌ద్ద వారంద‌రికి చేప‌ట్టిన‌ ర్యాపిడ్‌ కరోనా టెస్టుల్లో.. సుమారు 200 మందికి పైగా కరోనా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఇది పంజాబ్‌ యంత్రాంగాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.

కరోనా బారినపడ్డ వారందరినీ ప్రస్తుతం వైద్యపర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వారిని కొవిడ్‌ ఆస్పత్రుల్లో చేర్చాలా? వద్దా? అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మొత్తం 800 మంది సిక్కు యాత్రికులు ఏప్రిల్‌ 12న పాకిస్థాన్‌కు వెళ్లారు. ఏప్రిల్‌ 12 నుంచి 22 వరకు వైశాఖి ఉత్సవాలు జరగనున్న సందర్భంగా భారతీయ సిక్కులు ప్రతియేటా పాక్ కు వెళటానికి ఇష్టపడతారు. వెళ్లేటప్పుడు వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రెండు రోజులు క్యాంపులో ఉన్న వారంతా కొవిడ్‌-ఫ్రీ క్లియరెన్స్‌ ధ్రువపత్రం కూడా పొందారు. యాత్రికులకు పాకిస్థాన్‌ 10 రోజుల వీసా జారీ చేసింది. ఈ యాత్రలో వీరు దాయాది దేశంలోని పలు సిక్కు క్షేత్రాలను సందర్శించారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తులను అనుమతించాలన్న ద్వైపాక్షిక ప్రోటోకాల్‌ అమలులో భాగంగానే వీసాలు జారీ చేసారు.




Next Story