ఉగ్రమూకల ఘాతుకం.. కళ్లకు గంతలు కట్టి చంపేశారు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు మరో ఘాతుకానికి తెగబడ్డాయి. కిష్త్వార్ జిల్లి ఓహ్లి కుంత్వారా గ్రామంలో విలేజ్ డిఫెన్స్ గ్రూప్‌కు చెందిన ఇద్దరిని కిడ్నాప్ చేసి చంపేశాయి.
By అంజి Published on 8 Nov 2024 3:53 AM GMTఉగ్రమూకల ఘాతుకం.. కళ్లకు గంతలు కట్టి చంపేశారు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు మరో ఘాతుకానికి తెగబడ్డాయి. కిష్త్వార్ జిల్లి ఓహ్లి కుంత్వారా గ్రామంలో విలేజ్ డిఫెన్స్ గ్రూప్‌కు చెందిన ఇద్దరిని కిడ్నాప్ చేసి చంపేశాయి. కళ్లకు గంతలు, చేతులను కట్టేసి దారుణంగా హతమార్చాయి. ఈ ఘటనకు జైషే మహ్మద్‌కు చెందిన కశ్మీర్ టైగర్స్ బాధ్యత వహించింది. మృతుల కుటుంబాలకు సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎల్జీ మనోజ్ సిన్హా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గురువారం సాయంత్రం ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గ్రూప్ (వీడీజీ) సభ్యులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హతమార్చారు. బాధితుల మృతదేహాల చిత్రాలను కూడా ఉగ్రవాదులు పంచుకున్నారు. మృతులు ఓహ్లి కుంట్వారా గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్‌లుగా గుర్తించారు. వారి మృతదేహాలను ఇంకా వెలికితీయాల్సి ఉంది. మృతదేహాల కోసం పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నజీర్, కుల్దీప్ ఇద్దరూ తమ పశువులను మేపేందుకు అడవికి వెళ్లిన సమయంలో ఉగ్రవాదులు కిడ్నాప్‌కు గురయ్యారు. కుల్దీప్ సోదరుడు పృథ్వీ మాట్లాడుతూ, "నా సోదరుడు, అహ్మద్‌లను ఉగ్రవాదులు అపహరించి చంపినట్లు మాకు సమాచారం అందింది. వారు గ్రామ రక్షణ గార్డులు (VDGలు), ఎప్పటిలాగే పశువులను మేపడానికి వెళ్ళారు" అని చెప్పారు.
ఈ హత్యలను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు ఖండించారు.
"కిష్త్వార్‌లో విలేజ్ డిఫెన్స్ గార్డ్ సభ్యులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని ఖండించడానికి పదాలు సరిపోవు. ఈ పిరికి దాడిలో అమరవీరులైన వీర కుమారుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మేము అన్ని తీవ్రవాద సంస్థలను నాశనం చేయడానికి, ఈ అనాగరిక చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాము. ' అని లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్ చేశారు.