పోలీసుల ఎన్‌కౌంటర్‌లో.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

2 terrorists killed in encounter with police in J&K. శనివారం ఉదయం జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. జకురా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత ఉగ్రవాద సంస్థ లష్కరే

By అంజి  Published on  5 Feb 2022 2:57 AM GMT
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శనివారం ఉదయం జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. జకురా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి)-ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్)తో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులను శ్రీనగర్ పోలీసులు మట్టుబెట్టారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని ఇఖ్లాక్ హజామ్‌గా గుర్తించినట్లు కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని హసన్‌పోరాలో ఇటీవల హెడ్ కానిస్టేబుల్ అలీ ముహమ్మద్ గనీ హత్యలో హజామ్ ప్రమేయం ఉంది. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టల్స్‌తో సహా నిందితులను స్వాధీనం చేసుకున్నట్లు కుమార్ తెలిపారు.

కుల్గాం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా నియమితులైన అలీ ముహమ్మద్ గనీని జనవరి 29న హసన్‌పోరాలో అనుమానిత ఉగ్రవాదులు కాల్చిచంపారు. అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరాలోని తబలా ప్రాంతంలోని ఆయన నివాసానికి సమీపంలో ముష్కరులు అతనిపై కాల్పులు జరిపారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ వారం ప్రారంభంలో, షోపియాన్ జిల్లాలోని అమిషిజిపోరా ప్రాంతంలో ఒక పోలీసుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన ఏఎస్‌ఐ షబీర్‌ అహ్మద్‌ను ఆస్పత్రికి తరలించారు.

Next Story