కేరళలోని పనపుళలో ఇద్దరు వ్యక్తులు కొండచిలువను వేటాడి మాంసం వండుకుని తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పానపుళలో గురువారం ఒక కొండచిలువను చంపి దాని మాంసం వండారనే ఆరోపణలపై అటవీ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు ప్రమోద్, బినీష్ ఇద్దరూ స్థానికులు బుధవారం సాయంత్రం తమ ఇళ్లకు సమీపంలోని రబ్బరు తోట నుండి ఒక పెద్ద కొండచిలువను వేటాడారని, ఆ తర్వాత వారు ఆ సరీసృపాన్ని వధించి, ప్రమోద్ నివాసంలో కూర తయారు చేశారని ఆరోపించారు.
పక్కా సమాచారం మేరకు తాలిపరంబా రేంజ్ ఆఫీసర్ సురేష్ అండ్ బృందం ఆ ఇంటిపై దాడి చేసి, పాము భాగాలను, వండిన వంటకాన్ని స్వాధీనం చేసుకున్నారు. "వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరినీ గురువారం కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.