ఆర్‌జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం.. 19 మంది అరెస్టు

కోల్‌కతా మహానగరంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన విధ్వంసం, హింసకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  16 Aug 2024 12:25 PM IST
arrest, vandalism, Kolkata, RG Kar hospital

ఆర్‌జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం.. 19 మంది అరెస్టు

కోల్‌కతా మహానగరంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన విధ్వంసం, హింసకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేసినట్లు కోల్‌కతా పోలీసులు శుక్రవారం తెలిపారు. అరెస్టు చేసిన వారిని సిటీ కోర్టు ఆగస్టు 22 వరకు పోలీసు కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఆగస్ట్ 9న ఆసుపత్రి సెమినార్ హాల్‌లో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన ఘటనను ఖండిస్తూ పశ్చిమ బెంగాల్ అంతటా మహిళలు అర్ధరాత్రి నిరసనల మధ్య గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు, నర్సింగ్ స్టేషన్, మెడిసిన్ స్టోర్, ఔట్ పేషెంట్ విభాగంలోని భాగాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ హింసాకాండలో కొంతమంది పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉండగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీపై అత్యాచారం-హత్యను నిరసిస్తూ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల వద్ద జూనియర్ డాక్టర్ల విరమణ పని శుక్రవారం కూడా కొనసాగింది.

బాధ్యులను కఠినంగా శిక్షించాలని, ఆస్పత్రుల్లో భద్రతను పెంచాలని ఆందోళన చేస్తున్న వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో విధ్వంసం, హింస జరిగినప్పుడు పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డులోని రెండు అంతస్తులు ధ్వంసమయ్యాయని, మౌలిక సదుపాయాలు, పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.

Next Story