పాఠశాలలో 16 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్‌.. ఓమిక్రానేనా.!

16 students of Navi Mumbai school test positive for Covid-19. పాఠశాలలో 16 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. వీరంతా 8 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్నారు.

By అంజి  Published on  18 Dec 2021 2:02 PM IST
పాఠశాలలో 16 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్‌.. ఓమిక్రానేనా.!

మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఓ పాఠశాలలో 16 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. వీరంతా 8 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్నారు. దీంతో అధికారులు శనివారం పాఠశాలలో అందరికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ 600 మందికి పైగా విద్యార్థులకు వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఒకరి తండ్రి కొద్ది రోజుల క్రితం ఖతార్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం తెలిపింది. ముందుజాగ్రత్తగా ఆ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు చేశారు.

విదేశాల్లో నుండి తిరిగి వచ్చిన ఆ వ్యక్తికి పరీక్షల్లో నెగిటివ్‌ రాగా, అతని కుమారుడి నివేదిక పాజిటివ్‌గా వచ్చింది. దీని తరువాత కరోనా సోకిన విద్యార్థితో పరిచయం ఉన్న విద్యార్థులందరికీ కోవిడ్ పరీక్ష జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం 16 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. విద్యార్థులకు కరోనా సోకడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్-19 యొక్క 10,582 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర అధికారుల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటివరకు 40 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే వారికి సోకిన వేరియంట్‌ ఎంటనే దానిపై విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.

Next Story