కోతి అంత్యక్రియ‌ల‌కు భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌నం.. ఇద్ద‌రి అరెస్ట్‌

1500 Attend Monkey's Funeral Feast In Madhya Pradesh.డిసెంబర్ 29న కోతి చనిపోవడంతో బాధపడ్డ రాజ్‌గఢ్ జిల్లాలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2022 10:52 AM GMT
కోతి అంత్యక్రియ‌ల‌కు భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌నం.. ఇద్ద‌రి అరెస్ట్‌

కోతుల‌ను కొంద‌రు అంజ‌న్న స్వ‌రూపంగా బావిస్తుంటారు. అందుకనే కోతుల‌ను కొట్ట‌డం వంటివి చేయ‌రు. ఓ గ్రామంలో కోతి చ‌నిపోతే.. దానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి గుండు గీయించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి దశదిన కర్మ కూడా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి 1500 మందికిపైగా హాజ‌రయ్యారు. అయితే.. క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. రాజ్‌ఘడ్ జిల్లాలోని దలుపురా గ్రామంలో డిసెంబర్ 29న ఓ వాన‌రం మ‌ర‌ణించింది. అదే రోజు గ్రామ‌స్థులు అంద‌రూ క‌లిసి దానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. పాడెపై కోతి మృత‌దేహాన్ని ఉంచి ఊరేగింపుగా తీసుకువ‌చ్చి కొరివి పెట్టారు. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం హ‌రి సింగ్ అనే వ్య‌క్తి గుండు గీయించుకున్నాడు. అనంత‌రం ద‌శ‌దిన క‌ర్మ నిర్వ‌హించాల‌ని గ్రామ‌స్థులు చందాలు వేసుకున్నారు. దశ‌దిన క‌ర్మ భోజ‌నానికి 1500 మందికిపైగా హాజ‌ర‌య్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డ 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉండ‌గా.. దాన్ని బ్రేక్ చేశార‌ని ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు.

Next Story