తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

1498 New corona cases in telangana.తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 62,350 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. కొత్త‌గా 1,498 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 4:44 AM GMT
telangana corona cases

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 62,350 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. కొత్త‌గా 1,498 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయని వైద్య ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735కి చేరింది. కాగా.. నిన్న ఒక్క క‌రోనా కార‌ణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,729కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,452 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,03,013కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 9,993 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 313 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి.


Next Story
Share it