చికెన్ బిర్యానీ తిని 145 మందికి అస్వస్థత..
145 fell ill after having biryani at Assam govt event.అస్సాంలో పుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. చికెన్ బిర్యానీ తిని 145 మందికి అస్వస్థత.
By తోట వంశీ కుమార్ Published on 4 Feb 2021 4:13 PM IST
అస్సాంలో పుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలోనే చికెన్ బిర్యానీ తిని 145 మంది అస్వస్థతకు గురైయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఉన్నారు. అసోంలోని కర్బీ అంగ్‌లాంగ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనవరి 2న కర్బీ అంగ్‌లాంగ్‌లోని డిఫు మెడికాల్ కాలేజీలో ఎంబీబీఎస్ అకాడమిక్ సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అసోం సీఎం సర్బానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యమంత్రి హిమంతబిశ్వ వర్మతో పాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.
దాదాపు 8వేల మంది ఈకార్యక్రమంలో పాల్గొనగా.. వారందరికి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు. ఇది తిన్న తరువాత వారిలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బిస్మాశర్మ కూడా ఉన్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో ఏకంగా 145 మంది ఆస్పత్రి పాలయ్యారు. వాంతులు విరోచనాలతో బాధపడ్డారు.' అదే క్యాంటిన్‌లో వండిన బిర్యానీని నేను కూడా తిన్నా. కాసేపటికే అస్వస్థతకు గురయ్యాను. ప్రస్తుతం బాగానే ఉన్నా. నాతో పాటు 145 మంది అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స అనంతరం 18 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 117 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.' అని అసోం ఆరోగ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
సీఎం పాల్గొన్న కార్యక్రమంలో ఇలా జరగడం పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు కర్బీ ఆంగ్లాంగ్ డిప్యూటీ కమిషనర్ ఎన్‌జీ చంద్ర ధ్వాజా సింఘా తెలిపారు. అయితే.. ఇదే కార్యక్రమానికి హాజరై బిర్యానీ తిన్న ఓ వ్యక్తి మరణించాడు. అయితే.. అతడు పుడ్‌పాయిజన్ వల్ల చనిపోయాడా లేక వేరే కారణమా అనేది తెలియాల్సి ఉంది.