Breaking : మ‌రో రైలు ప్ర‌మాదం.. పట్టాలు త‌ప్పిన‌ చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గోండా జిల్లాలోని గోండా-మంకాపూర్ రైల్వే సెక్షన్ మధ్య చండీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లోని 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

By Medi Samrat  Published on  18 July 2024 3:45 PM IST
Breaking : మ‌రో రైలు ప్ర‌మాదం.. పట్టాలు త‌ప్పిన‌ చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గోండా జిల్లాలోని గోండా-మంకాపూర్ రైల్వే సెక్షన్ మధ్య చండీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లోని 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం మేరకు 17 మంది గాయపడినట్లు సమాచారం. 15904 నెంబ‌రు గ‌ల చండీగఢ్ ఎక్స్‌ప్రెస్.. చండీగఢ్ నుండి గోరఖ్‌పూర్ వెళ్తోంది. మోతిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పికౌరా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత రెండు కోచ్‌లు పట్టాలు తప్పగా.. ఆ తర్వాత మరో 12 కోచ్‌లు బోల్తా పడ్డాయని వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. రైల్వే, పోలీసు బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దృష్టి సారించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులను రైల్వే ఆస్పత్రికి తరలిస్తున్నారు.


Next Story