నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మంది మృతి

13 dead as maharashtra bus falls into river narmada in madhyapradesh. మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు ప్రమాదవశాత్తు నర్మదా

By అంజి  Published on  18 July 2022 7:45 AM GMT
నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు మృతి చెందారు. ధార్‌ జిల్లాలోని ఖల్‌ఘాట్‌ ప్రాంతంలోని వంతెనపై రెయిలింగ్‌ విరిగిపోవడంతో బస్సు నదిలో పడిపోయింది. ఇండోర్ నుంచి పూణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 15 మందిని రక్షించినట్లు మధ్యప్రదేశ్‌ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు.

మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆచూకీ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్ సంఘటనా స్థలానికి చేరుకుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల మధ్య బస్సును వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ''ప్రమాద స్థలంలో జిల్లా అధికార బృందం ఉంది. బస్సు బయటకు తీయబడింది. నేను ధార్ జిల్లా యంత్రాంగంతో టచ్‌లో ఉన్నాను. గాయపడిన వారికి సరైన చికిత్స కోసం ఏర్పాట్లు చేయడానికి సూచనలు ఇవ్వబడ్డాయి." అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.



Next Story