వీధి కుక్కల దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని సిబి గంజ్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడు మృతి చెందాడు.

By అంజి  Published on  3 May 2023 4:30 AM GMT
stray dogs, Uttar Pradesh, CB Ganj area

వీధి కుక్కల దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని సిబి గంజ్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో చిన్నారికి కూడా గాయాలయ్యాయి. ఖానా గౌన్తియా గ్రామంలో తన స్నేహితులతో ఆడుకుంటున్న బాధితుడు అయాన్‌పై కుక్కలు దాడి చేశాయి. మంగళవారం నాడు ఈ సంఘటన జరిగింది. వీధికుక్కలు అతడిని వెంబడించడంతో బాలుడు ప్రాణాల కోసం పరిగెత్తాడు. అయితే అతను ప్రమాదవశాత్తూ కాలు తట్టి నేలపై పడిపోయాడు. దీంతో కుక్కలు అతనిపై దాడి చేసి దాడి చేశాయి.

బాటసారులు బాలుడిపై కుక్కలు దాడి చేయడాన్ని గమనించి రక్షించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బరేలీలో పిల్లలపై వీధికుక్కలు దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడి చేయడంతో మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె తన ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు ఆమెపైకి దూసుకెళ్లి 150 మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేశాయి.

గతేడాది డిసెంబరులో సీబీ గంజ్ ప్రాంతంలోని మథురాపూర్ గ్రామంలో గోలు అనే 12 ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో గాయపడ్డాడు. గోలు తన స్నేహితులతో కలిసి ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఏడెనిమిది కుక్కలు అతనిపైకి వచ్చి దాడి చేశాయి. దాడి నుంచి బయటపడిన అతడిని స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. నగరంలో వీధికుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా అధికార యంత్రాంగానికి, మున్సిపల్ కార్పొరేషన్‌కు పలుమార్లు లేఖలు రాశారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Next Story