గ్వాలియర్‌లో దిగిన 12 దక్షిణాఫ్రికా చీతాలు

12 South African cheetahs land in Gwalior. ద‌క్షిణాఫ్రికా నుంచి 12 చీతాల‌ను తీసుకువ‌చ్చారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2023 6:13 AM GMT
గ్వాలియర్‌లో దిగిన 12 దక్షిణాఫ్రికా చీతాలు

దేశంలో అంత‌రించిపోయిన చీతా జాతిని పునఃప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నమీబియా నుండి ఎనిమిది చీతాల‌ను తీసుకువ‌చ్చిన ఐదు నెల‌ల త‌రువాత ద‌క్షిణాఫ్రికా నుంచి 12 చీతాల‌ను తీసుకువ‌చ్చారు. వీటిలో ఐదు ఆడ చిరుతలు కాగా ఏడు మగ చిరుతలు ఉన్నాయి.

దక్షిణాఫ్రికాలోని జోహ‌న్నెస్ బ‌ర్గ్ నుంచి IAF C-17 విమానంలో వీటిని తీసుకువ‌చ్చారు. శ‌నివారం ఈ విమానం గ్వాలియ‌ర్ ఎయిర్ బేస్‌లో దిగింది. అక్క‌డి నుంచి వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు త‌ర‌లించ‌నున్నారు.

ఈ రోజు మ‌ధ్యాహ్నాం మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాద‌వ్ లు చీతాల‌ను కునో నేషనల్ పార్క్‌లోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలోకి విడిచిపెట్ట‌నున్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం నెల రోజుల పాటు వీటిని క్వారంటైన్‌లో ఉంచ‌నున్నారు.

దీనిపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.."ఈరోజు కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య పెరుగుతోంది. నేను ప్రధాని మోదీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అది ఆయన దృష్టి. కునోకు 12 చిరుతలు పునరావాసం కల్పించబడతాయి. మొత్తం సంఖ్య 20 అవుతుంది," అని చౌహాన్ అన్నారు.

చీతాల సంఖ్య‌ను పెంచేందుకు భారతదేశం జనవరి 2022లో దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడుత‌గా 12 చీతాలు నేడు వ‌చ్చాయి. ఇలా ప‌దేళ్ల వ‌ర‌కు ఏటా 12 చీతాల‌ను ద‌క్షిణాఫ్రికా నుంచి దిగుమ‌తి చేసుకోనున్నారు.

Next Story