ఛత్తీస్‌గఢ్ అడవులు తుపాకుల మోతలతో మళ్లీ దద్దరిల్లాయి. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
బస్తర్ పోలీసు అధికారుల ప్రకారం, ఆదివారం ఉదయం అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. " బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సలైట్లు మరణించారు " అని వారు తెలిపారు. "ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు కాల్పుల్లో గాయపడ్డారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి" అని వారు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల జరిగిన భీకర కాల్పుల్లోనూ పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.