కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీకా రెండు డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవచ్చని తాజా మార్గదర్శకాలు చెబుతున్నాయి. గతంలో 28 రోజుల నుంచి ఆరు వారాల వ్యవధిలో వేసుకోవాలని నిబంధన ఉండేది. ఇప్పుడు తాజాగా వాక్సిన్ బెటర్ రిజల్ట్స్ కోసం కాస్త గ్యాప్ ఎక్కువగా ఉండాలని సూచించింది.
అంతే కాదు కరోనా పాజిటివ్ వచ్చిన వారు కోలుకున్న తరువాత కనీసం ఆరు నెలల వ్యవధిలో వ్యాక్సిన్ తీసుకో వచ్చు అని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ పేర్కొంది. ఇక డెలివరీ తర్వాత తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు గర్భిణి స్త్రీలు తాము ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అయితే కోవాగ్జిన్ డోసుల విషయం లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.