మద్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కల్తీమద్యం సేవించి 11 మంది మృత్యువాత పడగా.. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. మోరెనా జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వెంటనే వీరిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చించారు. ఆస్పత్రిలో చేరిన వారిలో ఏడుగురు పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఈఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.సమచారం అందుకున్న ఎస్పీ అనురాగ్ సుజనీయ అక్కడికి చేరుకున్నారు. మద్యం షాపు యజమానులను ప్రశ్నించారు.
మోరానా సమీపంలోని ఓగ్రామీణ ప్రాంతానికి చెందిన వీరంతా స్వతహాగా మద్యం తయారు చేసుకుని తాగారని.. ఆ తరువాత ఒక్కరికీ వాంతులు, కళ్లు తిరగడం ప్రారంభమయ్యాయని స్థానికులు తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇదిలా ఉంటే.. గతేడాది అక్టోబరులో కూడా మధ్యప్రదేశ్ లో కల్తీ మద్యం కారణంగా 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవక ముందే మరోసారి అటువంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కల్తీ మద్యం అనేక ప్రాంతాల్లో లభ్యమవుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు.