Ayodhya Ram Mandir: అయోధ్యకు ఊరేగింపుగా వెళ్తోన్న 108 అడుగుల అగరబత్తి

శ్రీరామ మందిరాన్ని దివ్యమైన పరిమళంతో నింపేందుకు గుజరాత్‌లోని వడోదర నుంచి 108 అడుగుల అగరబత్తిని అయోధ్యకు తరలిస్తున్నారు.

By అంజి  Published on  9 Jan 2024 6:13 AM GMT
108 feet long incense stick, Ayodhya, Gujarat, Ram Mandir

Ayodhya Ram Mandir: అయోధ్యకు ఊరేగింపుగా వెళ్తోన్న 108 అడుగుల అగరబత్తి

శ్రీరామ మందిరాన్ని దివ్యమైన పరిమళంతో నింపేందుకు గుజరాత్‌లోని వడోదర నుంచి 108 అడుగుల అగరబత్తిని అయోధ్యకు తరలిస్తున్నారు. సోమవారం ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రి, కిరావళికి చేరిన ఈ అగరబత్తీని వందలాది మంది తిలకించారు. హైవేపైకి చేరుకుని, అగరుబత్తీలను చూసి 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. వడోదర నుంచి ప్రారంభమైన యాత్ర ఊరేగింపుగా మారింది. 108 అడుగుల పొడవు, సుమారు మూడున్నర అడుగుల వెడల్పుతో 3,610 కిలోల బరువున్న అగరబత్తిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

ఈ అగరుబత్తీ తయారీకి ఆరు నెలల సమయం పట్టింది. వడోదరలో ఈ అగరుబత్తీ తయారు చేయబడింది. ఈ ప్రత్యేకమైన అగరుబండ తయారీలో అనేక రకాల మూలికలు ఉపయోగించబడ్డాయి. ఈ అగరుబత్తీ సుమారు ఒకటిన్నర నెలల పాటు వెలుగుతూనే ఉంటుంది. దాదాపు 50 కి.మీల విస్తీర్ణంలో సువాసనను వెదజల్లుతుంది. అయోధ్యలోని శ్రీరామ మందిరం 'ప్రాణ్‌ ప్రతిష్ఠ' జనవరి 22న జరగనుందని, ఈ సందర్భంగా అగరబత్తులను తయారు చేసే గుజరాత్‌ వాసి బీహభర్‌బాద్‌ తెలిపారు. దేశీ ఆవు పేడ, దేశీ ఆవు నెయ్యి, ధూపం పదార్థాలు సహా అనేక రకాల మూలికలు దీని తయారీలో ఉపయోగించబడ్డాయి.

Next Story