బ్రిటన్‌కు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చి భారత్.. బ్రిటన్‌ పౌరులకు చుక్కలే..!

10 Day Quarantine For UK Visitors In India.భారత ప్రయాణికుల పట్ల బ్రిటన్‌ వ్యవహారిస్తున్న తీరుకు భారత్‌ తనదైనశైలిలో

By అంజి  Published on  2 Oct 2021 5:56 AM GMT
బ్రిటన్‌కు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చి భారత్.. బ్రిటన్‌ పౌరులకు చుక్కలే..!

భారత ప్రయాణికుల పట్ల బ్రిటన్‌ వ్యవహారిస్తున్న తీరుకు భారత్‌ తనదైనశైలిలో సమాధానం చెప్పింది. భారత్‌కు వచ్చే యూకే ప్రయాణికుల పట్ల ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటన్ పౌరులు భారత్‌లో 10 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని తేల్చి చెప్పింది. కొత్త నిబంధనల ప్రకారం.. బ్రిటన్ పౌరులు ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్షను చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు చేరుకున్నాక మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేసుకోవాలి. తదనంతరం 8 రోజుల క్వారంటైన్‌ తర్వాత మరోసారి కొవిడ్‌ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. బ్రిటన్‌ నుంచి వచ్చే పౌరులు తప్పనిసరిగా వారు ఉండే హెటళ్లలోగాని, ఇళ్లలోగాని 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అయితే క్వారంటైన్‌కి వారు వేసుకున్న వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ నిబంధనలు అక్టోబర్‌ 4వ తేదీ నుండి వర్తించనున్నాయి.

కాగా ఇటీవల భారత్‌లో తీసుకున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తాము గుర్తించడం మొదట చెప్పి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌లో మాత్రం అనుమానాలున్నాయని చెప్పింది. దీంతో కొవిషీల్డ్ రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకుని బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికుల పట్ల ఆంక్షలు విధించింది. 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి అధికారులు నిబంధనలు పెట్టారు. దీనిని తీవ్రంగా ఖండించిన భారత్‌.. వెనక్కి తగ్గపోతే తగిన స్థాయిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. అయితే ఈ విషయంలో బ్రిటన్‌ వెనక్కి తగ్గకపోవడంతో భారత్‌ ప్రతిచర్యలకు ఉపక్రమించింది. భారత్‌ వచ్చే బ్రిటన్‌ ప్రయాణికులు 3 సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలతో పాటు 10 రోజులు క్వారంటైన్‌ ఉండడం వంటి ఆంక్షలు విధించింది. జాన్సన్ అండ్‌ జాన్సన్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్-ఎన్‌బయోటెక్‌ వ్యాక్సిన్లను మాత్రమే గుర్తించిన బ్రిటన్‌ ప్రభుత్వం.. కొవిషీల్డ్‌ను గుర్తించకపోవడంతో వివాదాస్పదంగా మారింది.

Next Story