1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు
1 to 5 Class not to open says karnataka education minister. 1 నుంచి 5వ తరగతి వరకు క్లాసులు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
By తోట వంశీ కుమార్
కర్ణాటకలో కరోనా మహ్మమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో పాఠశాలలకు పలు నిబంధనలు జారీ చేసింది. అయితే వీటిని ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు క్లాసులు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 5వ తరగతి వరకు కేవలం ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని పాఠశాలలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ 1 నుంచి 5వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు.
ఇటీవల కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలు తెరవవద్దని సూచించారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఎలాంటి క్లాసులు నిర్వహించారని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక తరగతులు నిర్వహిస్తున్నారంటూ ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన అన్నారు. తాజాగా విద్యాశాఖ ఆదేశాల మేరకు అధికారులు ప్రాథమిక తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు చేపడుతున్నారు.
కాగా, ఇప్పటికే ఏడాదికిపైగా పాఠశాలలు మూత పడటంతో విద్యార్థుల చదువులకు తీవ్ర అటంకం ఏర్పడింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అనుకుని అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా పాఠశాలలు తెరుస్తున్న క్రమంలో మళ్లీ మహమ్మారి విజృంభించడంతో గత ఏడాది పరిస్థితి మళ్లీ వస్తుందేమోనన్న భయాందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలు విధిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. కరోనా కట్టడి చేసేందుకు పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తోంది. మాస్కులు ధరించనివారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతోంది. అలాగే భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.