ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు దేశ ప్రజలకు వీడియో సందేశం ఇవ్వనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఓ చిన్న వీడియో సందేశాన్ని పంచుకుంటానని ప్రధాని మోదీ తన ట్విటర్‌లో వెల్లడించారు.

ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానీ మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎంలు మోదీకి వివరించారు. అలాగే మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు.

Also Read: నిబంధనల్ని ఉల్లంఘిస్తే జైలుకే..లాక్ డౌన్ పై కేంద్రం సీరియస్

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని రాష్ట్రాలు ఒక్కటై పని చేయడం ప్రశంసనీయమన్నారు. లాక్‌డౌన్‌ గడువు ముగిశాక ప్రజలంతా ఒక్కసారిగా బయటకు వస్తే మహమ్మారి కరోనా విజృంభించే అవకాశం ఉందని అన్నారు. ఇలా జరిగితే మరోసారి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని మోదీ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త పరిష్కార వ్యుహాన్ని రూపొందించుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు స్వచ్ఛంధ సంస్థలు, సంక్షేమ సంస్థల సాయం తీసుకోవాలన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతన మనందరీపై ఉందని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: పుట్టిన పిల్లలకు ఒకరికి ‘లాక్‌డౌన్‌’ పేరు.. మరొకరికి ‘కరోనా’ పేరు

దేశంలో ఇప్పటి వరకు 1965 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు 150 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని, 50 మృతి చెందారని తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.