ఆ విషయంలో ఇండస్ట్రీ చాలా బెటర్ అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 May 2020 9:01 AM GMTమీ టూ.. రెండేళ్ల క్రితం బాలీవుడ్ నుంచి క్యాస్టింగ్ కౌచ్ పై మొదలైన ఉద్యమం. అప్పట్లో ఈ మీ టూ ఉద్యమం సంచలనంగా మారింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి కూడా ఈ ఉద్యమం పాకింది. మీ టూ ఉద్యమం పేరుతో కాకపోయినా నటి శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై ధర్నా, అర్థనగ్న ప్రదర్శన చేసి ఆందోళన చేశారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా మంది చాలా రకాలుగా వాడుకున్నారని, తనలాంటివారెందరో ఉన్నారు కానీ వారంతా బయటికి చెప్పేందుకు భయపడుతున్నారంటూ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీ రెడ్డి. ఆ తర్వాత చాలామంది నటీమణులు తమకెదురైన సంఘటనల గురించి ధైర్యంగా సోషల్ మీడియా వేదికగా చెప్పారు. నటీమణులతో పాటు సాధారణ మహిళలు సైతం తమ భర్తల నుంచి వస్తున్న వేధింపుల గురించి మీడియాతో వెల్లడించారు.
తాజాగా.. బిగ్ బాస్ కంటెస్టెంట్ నందినీ రాయ్ క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తావన రాగా.. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాక.. అన్నిరంగాల్లోనూ మహిళలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొంది నందినీ రాయ్. అయితే ఎదుటి వ్యక్తి అడిగింది ఇచ్చే విషయం మాత్రం అమ్మాయిల ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నారు.
మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం చాలా మంది శృంగారం ఆఫర్లు చేసిన ఘటనలు తనకెన్నో తెలుసునన్నారు. సినీ రంగంలో మాత్రం ఎవరైనా శృంగారానికి నో చెప్తే ఎవరూ ఏమీ చేయలేరని నందినీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మిగతా రంగాలతో పోలిస్తే సినీ రంగం క్యాస్టింగ్ కౌచ్ విషయంలో కాస్త బెటర్ అని చెప్పింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.