పెళ్లి వ‌ద్దంటున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌.. స‌పోర్టు చేస్తున్న రాణా, వ‌రుణ్‌తేజ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2020 7:05 AM GMT
పెళ్లి వ‌ద్దంటున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌.. స‌పోర్టు చేస్తున్న రాణా, వ‌రుణ్‌తేజ్

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ పెళ్లే వ‌ద్దంటున్నాడు. పెళ్లి చేసుకుని త‌ప్పు చేయవ‌ద్ద‌ని సూచిస్తున్నాడు ఈ సుప్రీర్ హీరో. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాయి ధరమ్ తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ చిత్రం నుండి 'నో పెళ్లి' అంటూ సాగే పాటను హీరో నితిన్ విడుదల చేశారు. పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని.. అలాంటి పిచ్చి పని చెయ్యొద్దని.. సింగిల్స్.. మింగిల్స్ గా మారొద్దని.. ఏకత్వంలోని లోతుతత్త్వం ఉపదేశిస్తూ ఈ పాట సాగింది.

రఘురామ్ సాహిత్యాన్ని అందించ‌గా అర్మాన్ మాలిక్ ఈ పాట‌ను పాడారు. తేజు సరసన నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుండ‌గా.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సాంగ్ వీడియోలో మరో మెగా హీరో వరుణ్ తేజ్ - రానా దగ్గుబాటి కనిపించడం విశేషం. అసలే ఇద్దరూ మెగా హీరోలు బ్యాచిలర్లు.. ఇలా సభ్యసమాజానికి నో పెళ్లి మెసేజ్ ఇస్తున్నారు. ఆ మెసేజ్ ను త్వరలో ఒకింటివాడు కాబోతున్న నితిన్ చేతే విడుదల చేయించారు.

బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడదులైన‌ ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ థీమ్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం మరో విశేషం. అంతేకాకుండా ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌లో ఈ పాట కొనసాగుతోంది.

Next Story
Share it