నెట్టింట సంద‌డి చేస్తున్న న‌మ‌త్రా పెళ్లి ఫోటో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2020 10:11 AM GMT
నెట్టింట సంద‌డి చేస్తున్న న‌మ‌త్రా పెళ్లి ఫోటో

న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌.. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విష‌యం తెలిసిందే. న‌మ్ర‌త త‌ర‌చుగా త‌న ఫ్యామిలీ విష‌యాల‌ను సోష‌ల్‌మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల‌ను ఆశ్చ‌ర్యప‌రుస్తుంది. ముఖ్యంగా గ‌త స్మృతుల ఫోటోల‌తో అభిమానుల ముఖంలో ఆనందం వెల్లివిరిసేలా చేస్తుంది.

తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో నాటి-నేటి పెళ్ళి ఫోటోలు షేర్ చేస్తూ 'పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్' అనే కామెంట్ పెట్టింది. యాదృచ్చికం అనేది అసాధార‌ణం. జీవితం అనేది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళు స్వ‌ర్గంలో జ‌రుగుతుంటాయి అని కామెంట్ పెట్టింది. న‌మ్ర‌త షేర్ చేసిన ఫోటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా, మ‌హేష్ బాబుని పెళ్లి చేసుకున్న త‌ర్వాత న‌మ్ర‌త సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది. మ‌హేష్ సినిమాల‌కు సంబంధించిన ప‌నుల‌తో పాటు ఇత‌ర బిజినెస్‌లు చూసుకుంటుంది.

ఇదిలావుంటే.. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌, 14రీల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Next Story