అంతా అబద్దం..అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదంపై స్పందించిన నాగార్జున

By సుభాష్  Published on  16 Oct 2020 11:12 AM GMT
అంతా అబద్దం..అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదంపై స్పందించిన నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఓ సినిమా కోసం వేసిన సెట్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరుగగా, వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అర్పివేయడం పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కింగ్‌ నాగార్జున ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. 'అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంతా బాగుంది' అని కామెంట్‌ పెట్టారు. అయితే అంతకు ముందు కూడా అన్నపూర్ణ స్టూడియో సిబ్బంది స్పందించారు. అగ్ని ప్రమాదంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలిపింది.

కాగా, ఓ సినిమా షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు వార్తలను పలు మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి. నిప్పులేనిదే పొగ రాదన్నట్లు చాలా మీడియా సంస్థల్లో కూడా అదే నిజమని స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఇదంతా అబద్దం అంటూ నాగార్జున ఖండిస్తూ ట్వీట్‌ చేశారు. కాగా, అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం నిజమని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సైతం కూడా బయటకు వచ్చింది.Next Story