నాగార్జున త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

By Medi Samrat  Published on  17 Oct 2019 1:23 PM GMT
నాగార్జున త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవ‌ల మ‌న్మ‌థుడు- 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో తదుప‌రి సినిమాకి ఎలాంటి క‌థ‌ను ఎంచుకోవాలి అనే విష‌యంలో ఆలోచ‌న‌లో ప‌డ్డారు నాగ్. సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాకి ప్రీక్వెల్ బంగార్రాజు చేయాల‌నుకున్నారు. ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జునే నిర్మించాల‌నుకున్నారు.

ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పై ఉండాలి కానీ... ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దీంతో అస‌లు ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. అస‌లు విష‌యం ఏంటంటే... ఈ సినిమా ఖ‌చ్చితంగా ఉంటుంద‌ట‌. కాక‌పోతే.. దీనికంటే ముందు వేరే సినిమా చేయాల‌నుకుంటున్నార‌ని తెలిసింది. ఇంత‌కీ ఎవ‌రితో అంటారా..? ఊపిరి, మ‌హ‌ర్షి చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసిన సోల్మాన్ ఇటీవ‌ల నాగార్జున‌కు ఓ క‌థ చెప్ప‌డం.. క‌థ న‌చ్చి నాగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌.

ఈ సినిమా డిసెంబ‌ర్ లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని.. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించ‌నున్న‌ట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. హిందీలో విజయవంతం అయిన థ్రిల్లర్ మూవీ రైడ్ తెలుగు రీమేక్ లో నాగార్జున న‌టించ‌నున్న‌ట్టు ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై నాగార్జున క్లారిటీ ఇస్తూ.. త‌దుప‌రి చిత్రాన్ని త్వ‌ర‌లో ఎనౌన్స్ చేస్తార‌ని ఆశిద్దాం.

Next Story
Share it