బైక్ అంబులెన్స్ నడిపిన నగరి ఎమ్మెల్యే రోజా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2020 1:51 PM GMT
బైక్ అంబులెన్స్ నడిపిన నగరి ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే రోజా ఏం చేసినా సెన్సేషనే. నిత్యం ప్రజల్లో ఉండే రోజా.. నగరి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో తన నియోజకవర్గంలో రెండు బైక్ అంబులెన్స్ లను ప్రారంబించారు. నగరి, పుత్తూరు ప్రభుత్వాసుపత్రులకు చెరొకటి చొప్పున బైక్ అంబులెన్స్‌ను అందజేశారు. రోజా స్వయంగా నడపడంతో ప్రజలు సంబరపడ్డారు. ఈ బైక్ అంబులెన్స్ లను హీరో మోటార్స్ కంపెనీ తయారు చేసి అందజేసింది. ఎమ్మెల్యే రోజా కోరిక మేరకు కంపెనీ వారు బైక్ అంబులెన్స్ లను తయారు చేసి అందించారు. దాంతో బైక్ అంబులెన్సులు అందజేసిన హీరో మోటార్స్ కు రోజా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ముఖ్య నాయకులు, హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇక ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈరోజు 10,794 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,98,125కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,94,019 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 99,689 మంది చికిత్స పొందుతున్నారు. ఈమహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,417 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story
Share it