హైదరాబాద్‌: నటుడు, జనసేన పార్టీ నాయకుడు కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు .లైఫ్ తీసుకొనే వాళ్ళని అధికార ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు.. ఏవిటో ఈ జనం.దేవుడా ఈ జనాల మనసు మార్చు (ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్‌) అంటూ నాగబాబు ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో వైసీపీకి అధికారం పక్షం అప్పజెప్పి, టీడీపీ ప్రతిపక్షం అప్పజెప్పారు. దీంతో ప్రజలను ఉద్దేశించి, ఏపీ రాజకీయాలపై నాగబాబు ఈ ట్వీట్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. ప్రస్తుతం నాగబాబు.. జీ తెలుగులో వచ్చే ‘అదిరింది’ షోలో జడ్జ్‌గా చేస్తున్నారు.

అయితే నాగబాబు చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. కొన్ని జీవితాలు అంతే, మారవు సార్‌ అంటూ కామెంట్‌ చేయగా.. మరికొందరు మీ చేతకాన్ని తనాన్ని జనంపై రుద్దకండి మాస్టారు అంటూ చురకలంటిస్తున్నారు. జనసేన గెలిస్తే జనాలు మంచోళ్లు.. లేకుంటే కాదా అంటూ మండిపడుతున్నారు. ‘మా నరసాపురం ఒకసారి రండి సార్,పరిస్థితి మనకు అనుకూలంగా ఉంది,సైనికుల్లో ఉత్సహం నింపండి ఈసారి తప్పక గెలుస్తాం.’ అంటూ రిప్లై ఇచ్చారు. మరొకరు దేవుడు అనే వాడు లేడు కదండీ.. నాస్తిక హిందువు గారు అంటూ నాగబాబును ట్విటర్‌లో ప్రశ్నించారు.

ఇక వైసీపీ నుంచి రాజ్యసభ సీటు చిరంజీవికి ఖాయమైందన్న వార్తలపై ఇటీవలే నాగబాబు తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా స్పందించాడు. ప్రస్తుతం చిరంజీవికి ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాల్లో బీజీగా ఉన్నాడని తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.